Home Page SliderNational

బిచ్చగాడు సినిమాకి.. దేశంలో నోట్ల రద్దుకీ లింకేంటీ?

భారతదేశంలో ఎన్నో ఏళ్ల తర్వాత బీజేపీ హయాంలోనే నోట్ల రద్దు జరిగింది. కాగా  కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ హాయాంలో 2016 నవంబరు 8న దేశంలో 500,1000 రూపాయల నోట్లను రద్దు చేస్తూ..బీజేపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కాగా దీని ద్వారా దేశంలో పేరుకుపోయిన నల్ల డబ్బును బయటకు తీసుకురావాలని బీజేపీ ప్రయత్నించింది. మరోవైపు బిచ్చగాడు సినిమా 2016 మార్చ్ 4న విడుదలైంది. కాగా ఈ సినిమా విడుదలైన కొన్ని నెలల్లోనే దేశంలో 500,1000 నోట్లు రద్దు అయ్యి..2000 రూపాయల నోటు చలామణిలోకి వచ్చింది. మళ్లీ ఇప్పుడు తాజాగా బిచ్చగాడు-2 సినిమా ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రాగా ఆరోజే 2000 రూపాయల నోటు రద్దు చేస్తున్నట్లు RBI ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో బిచ్చగాడు సినిమాకి ,నోట్ల రద్దుకి ఏదో అవినాభావ సంబంధం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ సినిమా రిలీజైన ప్రతిసారీ ఇలా నోట్ల రద్దు అవ్వడం విచిత్రంగానే అనిపిస్తుంది. దీంతో ఈ సారి బిచ్చగాడు-3 సినిమా కూడా వస్తే మళ్లీ ఏ నోట్లను రద్దు చేస్తారో అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.