Home Page SliderNationalPolitics

మహాయుతిలో కోల్డ్ వార్ నిజమేనా?

మహారాష్ట్ర రాజకీయాలు వేసవి ఎండలతో పాటు వేడెక్కుతున్నాయి. బీజేపీ-శివసేన-ఎన్సీపీలతో కూడిన కూటమి మధ్య విభేదాలున్నట్లు పలు వార్తలు వచ్చినా ఎవరూ బయటపడలేదు. అయితే తాజాగా శివసేనకు చెందిన డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే తనను తేలికగా తీసుకోవద్దని, 2022లో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని పడగొట్టానని గుర్తు చేశారు. దీనితో షిండేలోని అసంతృప్తి బయటపడినట్లయ్యింది. ఈ పార్టీల మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నట్లు వచ్చిన వార్తలు నిజమేనంటున్నారు రాజకీయవేత్తలు. గతంలో షిండే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమోదించిన ఒక ప్రాజెక్టును ఇటీవల సీఎం ఫడ్నవీస్ నిలిపివేసిన నేపథ్యంలో షిండే ఈ వ్యాఖ్యలు చేయడంతో ఈ హెచ్చరికలు చేశారని సమాచారం. ఇటీవల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నిర్వహిస్తున్న సమావేశాలకు షిండే హాజరు కావడం లేదని సమాచారం. దీనికి తోడు షిండే వర్గం ఎమ్మెల్యేలకు భద్రతను కూడా తొలగించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.