Home Page SliderNational

సిధ్-అదితీల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువా?

ఇక పెళ్లి తర్వాత అదితి- సిద్ధార్థ్ 8 ఏళ్ల ఏజ్ గ్యాప్ గురించి అభిమానుల్లో చ‌ర్చలు కొనసాగుతున్నాయి. సిద్ధార్థ్- అతిదీ జంట‌ సెప్టెంబర్ 16న పెళ్లి తేదీ అంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆ రోజునే అంద‌మైన జంట పెళ్లి జ‌రిగింది. ఈ జంట తమ సోషల్ మీడియాలో కొన్ని హార్ట్ ట‌చింగ్ ఫోటోగ్రాఫ్స్‌ని షేర్ చేసింది. అయితే వారి ప్రేమకు వ‌య‌సు పెద్ద అడ్డంకి కాదు. అదితి రావ్ హైదరి – సిద్ధార్థ్‌ల ప్రేమకథ వివ‌రాల్లోకి వెళితే… 2021లో తెలుగు చిత్రం `మహా సముద్రం` సెట్స్‌లో ఫస్ట్ టైమ్ కలుసుకున్నారు. షూటింగ్ టైమ్‌లో ప్రేమించుకున్నారు. ఇది విడదీయరాని బంధంగా మారింది. నిజానికి అదితి- సిద్ధార్థ్ సినిమా ప్రమోషన్స్ సమయంలో కూడా ఒకరికొకరు బాగా అర్థం చేసుకున్నారు. ప్రమోషనల్ ఈవెంట్స్ కోసం ఈ జంట ఒకే కారులో ప్రయాణించేవారు. ఈ జంట ఫస్ట్ నుండి తమ ప్రేమాయ‌ణం గురించి సీక్రెట్‌గా ఉంచాలని ప్ర‌యత్నించినా కానీ, పబ్లిక్ ఈవెంట్‌లలో వారి షోస్ చూస్తే రిలేష‌న్‌షిప్‌లో ఉన్నట్లుగానే అనిపించేవి. 2023లో సిధ్ 44వ పుట్టినరోజుకు శుభాకాంక్షలు చెప్పడంతో అదితీతో సిధ్ ఎఫైర్ గురించి పుకార్లు విపరీతంగా పెరిగాయి. అదే ఏడాది అక్టోబర్‌లో అదితి 37వ పుట్టినరోజున సిద్ధార్థ్ తన కాబోయే భార్యకి ఒక అంద‌మైన క‌విత‌ను అంకితమిచ్చాడు. అందరి దృష్టిని ఆకర్షించిన విషయం ఏమిటంటే సిద్ధార్థ్ అదితిని ఫస్ట్ టైమ్ త‌న కాబోయే పార్ట్‌నర్ అని పేర్కొన్నాడు. మొత్తంగా ఇద్దరి మధ్య యేజ్ గ్యాప్ 8 ఏళ్లుగా తేలింది.

వోగ్‌కి ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అదితి తమ ఫస్ట్ క‌ల‌యిక గురించి గుర్తు చేసుకుంటూ తాము సెట్‌లో ఉన్న‌ప్పుడు ఎలా క‌లుసుకునేవాళ్ల‌మో చెప్పారు. సెట్‌లో నెయ్యి ఇడ్లీల షేరింగ్ గురించి కూడా అదితీ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఈ అంద‌మైన జంట‌ తరచుగా ఈవెంట్‌లు, రొమాంటిక్ డేట్ నుండి వారి లవ్-డోవీ ఫోటోగ్రాఫ్స్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసేది. సిద్ధార్థ్ తనకు ఎలా ప్రపోజ్ చేశాడో అదితి రావ్ హైదరీ వోగ్ ఇంట‌ర్వ్యూలో వెల్లడించింది. ఒక ఏడాది సరదాగా ఇద్దరూ మాట్లాడుకున్న తర్వాత చివరకు సిద్ధార్థ్ ఆమెకు ఎలా ప్రపోజ్ చేసాడంటే.. అత‌డు త‌న దివంగ‌త నానీ (అమ్మమ్మ‌) ఉండే ఊరికి వ‌చ్చి సిధ్ ప్రపోజ్ చేశాడ‌ని అదితీ తెలిపింది. నానీకి అదితీ ఎంతో స‌న్నిహితురాలు. సిధ్ మోకాలిపై త‌న‌కు ప్ర‌పోజ్ చేశాడ‌ని తెలిపింది. త‌న చిన్న‌నాటి పుట్టిన ఊరిలో అత‌డు ప్రపోజ్ చేయ‌గానే వెంట‌నే ప‌డిపోయాన‌ని తెలిపింది. ఆ త‌ర్వాత క‌థంతా తెలిసిందే. ఇప్పుడు మూడు ముళ్ల బంధంతో ఒక‌టైన ఈ జంట‌కు శుభాకాంక్ష‌లు.