తెలంగాణ రాజకీయాలు ముగిశాయా.. విలేకర్ల ప్రశ్నకు షర్మిల సమాధానం ఏంటంటే?
జీవితాలు వేరు.. రాజకీయాలు వేరు-వైఎస్ షర్మిల
నా కుమారుడి పెళ్లికి వస్తానని చంద్రబాబు మాటిచ్చారు
కుమారుడి పెళ్లికి చంద్రబాబు వస్తానని హామీ ఇచ్చారన్నారు వైఎస్ షర్మిల. తన భేటీలో వైఎస్సార్, చంద్రబాబు రాజకీయం గురించి చెప్పారని, రాజకీయాల గురించి అసలు మాట్లాడలేదన్నారు. గతంలో వారిద్దరూ ఎలా రాజకీయాలు చేశారన్నది షర్మిల చెప్పారన్నారు. భేటీలో రాజకీయాల గురించి తానేమీ మాట్లాడలేదన్నారు. కాంగ్రెస్ పార్టీలో తాను చేరడం జరిగిందని, రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశానికి మంచి జరుగుతుందని, మత కల్లోలాలు ఉండవని, రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని వైఎస్సార్ చెప్పేవారన్నారు షర్మిల. కాంగ్రెస్ పార్టీ ఏం చెబితే ఆ పని చేస్తానన్నారు.

చంద్రబాబు ఇప్పటి వరకు ఒక క్రిస్మస్ కేక్ మాత్రమే పంపానన్నారు. లోకేష్ కూడా గతంలో తన ట్వీట్ కు రెస్పాన్స్ ఇచ్చారన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ కు కూడా కేక్ పంపించానన్నారు షర్మిల. రాజకీయం ప్రొఫెషన్ మాత్రమేనని… జీవితం కాదన్నారు. ఒకరిపై ఒకరు మాట్లాడుకుంటామని.. రాజకీయ ప్రత్యర్థులం కాబట్టి విమర్శించుకోవాల్సి ఉంటుందన్నారు. అయితే వ్యక్తిగతంగా ఏదైనా సంబంధాలుండాలనే తన కుమారుడి పెళ్లికి పిలవడానికి వచ్చానన్నారు. రాజకీయంగా ఏ లావాదేవీలు తమకు లేవన్నారు. గతంలో వైఎస్సార్ కూడా చంద్రబాబును కుటుంబ కార్యక్రమాలకు పిలిచేవారన్నారు. అప్పుడు చంద్రబాబు వాటికి హాజరయ్యారన్నారు. తెలంగాణలో రాజకీయాలు ఉంటాయా.. ఉండవా.. అన్న ప్రశ్నకు షర్మిల సూటిగా జవాబివ్వలేదు. కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు మాత్రమే తాను పాటిస్తానన్నారు. ఉండొచ్చు.. ఉండకపోవచ్చన్న భావనను ఆమె వ్యక్తం చేశారు.
