Home Page SlidermoviesNational

రెహమాన్ విడాకులకు ఆమే కారణమా?..

సుప్రసిద్ధ దర్శకుడు ఏఆర్ రెహమాన్, తన భార్య సైరాభానుతో విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొద్ది సేపటికే రెహమాన్ వద్ద అసిస్టెంట్‌గా పని చేస్తున్న మహిళా అసిస్టెంట్ మోహిని డే కూడా మంగళవారం సాయంత్రమే తన భర్తకు విడాకులు ఇచ్చినట్లు ప్రకటించడం సంచలనంగా మారింది. రెహమాన్ విడాకులకు, మోహిని డే విడాకులకు ఏమైనా సంబంధం ఉందా? అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అయితే ఈ విషయం తన ఇన్‌స్టా స్టోరీలో పోస్ట్ చేసిన మోహిని విడిపోయినప్పటికీ తన భర్తతో కలిసి ఇప్పటికే కమిట్ అయిన ప్రోగ్రామ్స్‌కు పని చేస్తానని క్లారిటీ ఇచ్చింది. మరోపక్క రెహమాన్, సైరాభానుల పిల్లలు తమ తల్లిదండ్రులకు పరస్పర ప్రేమ ఉన్నప్పటికీ, వారి మధ్య భావోద్వేగ పూరిత ఒత్తిడి కారణంగా విడిపోతున్నట్లు ప్రకటించారు.