Home Page SliderNational

సానియా మీర్జా విడాకులు ఖాయమేనా?

ప్రముఖ టెన్నీస్ స్టార్ ప్లేయర్ సానియా మీర్జా విడాకులు తీసుకోబోతున్నారని గతకొంతకాలంగా  సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై సానియా ఇప్పటికీ స్పందించలేదు. అయితే తాజాగా సానియా భర్త షోయబ్ తన ఇన్‌స్టాగ్రామ్ బయోలో మార్పులు చేయడంతో మరోసారి ఈ విడాకుల వార్త వైరల్ అవుతోంది. షోయబ్ ఇది వరకు తన ఇన్‌స్టా బయోలో సూపర్ వుమెన్ సానియా మీర్జాకు భర్త,ప్రేమకు ప్రతి రూపమైన ఒకరికి తండ్రి అని ఉండేది. అయితే ఇప్పుడు ఆయన దాన్ని మార్చేశారు. కాగా షోయబ్ తన ఇన్‌స్టా బయోలో తండ్రి అనే పదాన్ని తొలగించి,ఓ బిడ్డకు తండ్రి అని మాత్రమే ఉంచారు. దీంతో సానియా మీర్జా నిజంగానే తన భర్త నుంచి విడాకులు తీసుకుంటున్నారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.