Home Page SliderNational

మూడో భార్యతో కూడా పవన్ విడాకులు తీసుకోబోతున్నారా?

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు జనసేన వారాహి యాత్రలో కూడా పాల్గొంటూ తీరిక లేకుండా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆయన భార్య అన్నా లెజినోవా విడి విడిగా ఉంటున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే రెండు రోజులుగా జాతీయ మీడియా సంస్థలు ఈ విషయం గురించి కోడై కూస్తున్నాయి. దీంతో ఈ వార్తలు తాజాగా తెలుగు ప్రసార మాధ్యమాల్లోనూ ప్రత్యక్షమయ్యాయి. కాగా పవన్ భార్య గతకొంతకాలంగా పిల్లలతో కలిసి రష్యాలో ఉంటున్నట్లు తెలుస్తోంది. అందుకే ఈ మధ్య ఆమె మెగా ఫ్యామిలీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదని సమాచారం. అయితే ఈ ప్రచారాన్ని పవన్ ఫ్యాన్స్ ,జనసైనికులు తోసిపుచ్చారు. కాగా రాజకీయ కుట్రలో భాగంగానే ఇలాంటి పుకార్లను వ్యాప్తి చేస్తున్నారని మండిపడుతున్నారు.