జయలలిత ఆస్తుల విలువ రూ.4000 కోట్లా?!
తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలిత ఆస్తిని తమిళనాడు ప్రభుత్వానికి ఫిబ్రవరి 14, 15వ తేదీల్లో అప్పగించాలని బెంగళూరు కోర్టు ఆదేశించింది. జయలలిత వారసులుగా చెబుతున్న జె.దీపక్, జె.దీప వేసుకున్న అర్జీని ఇటీవలే కర్ణాటక హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆస్తుల బదలాయింపుకి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇదిలా ఉండగా..తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువ రూ.913 కోట్లు ఉండగా.. ప్రస్తుతం వాటి మార్కెట్ విలువ రూ. 4,000 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.