గోల్డ్ కాయిన్స్ కొంటే లాభమేనా ?
సాధారణంగా గోల్డ్ కాయిన్స్, బిస్కెట్స్ 24 క్యారెట్ల బంగారం రూపంలో ఉంటాయి. బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునేవారు ఆభరణాల కంటే కూడా ఇలా మేలిమి బంగారం కొనడంలో ఆసక్తి చూపిస్తారు. ఎందుకంటే వీటిని అమ్మితే బంగారానికి పూర్తి ధర లభిస్తుంది. కానీ ఈ క్వాలిటీతో ఆభరణాల తయారీ దాదాపు అసాధ్యం. మన్నిక ఉండాలంటే 22 క్యారెట్ల బంగారమే సరైన ఎంపిక. 24 క్యారెట్ల బంగారం కొనుగోలు చేస్తే వాటిని లాకర్లలో దాచుకోవల్సి ఉంటుంది. వాటిని నగదుగా మార్చుకోవాలంటే గోల్డ్ షాపులలో కానీ, గోల్డ్ రిఫైనరీలలో కానీ అమ్మాల్సి ఉంటుంది. దీనికన్నా డిజిటల్ గోల్డ్ రూపంలో పెట్టుబడి పెట్టడం చాలా మంచిదని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు. డిజిటల్ గోల్డ్ సర్వీసులను ప్రస్తుతం అన్నిరకాల ఫైనాన్స్ యాప్స్ అందిస్తున్నాయి. గోల్డ్ ఈటీఎఫ్ కూడా భారీ లాభాలను అందిస్తోంది. వీటిలో కేవలం రూ.100 నుండి కొనుగోలు చేయవచ్చు.
అలాగే బంగారం కొనుగోలులో జాగ్రత్తగా ఉండాలి. వాటిలో బిఐఎస్ హాల్ మార్క్ ను గమనించాలి. అలాగే బిల్లులను తప్పకుండా తీసుకోవాలి. ఇది భవిష్యత్తులో రిటర్న్స్, మార్పిడి కోసం ఉపయోగపడుతుంది. ఆభరణాలు కొనేటప్పుడు స్వచ్ఛతను తెలుసుకోవాలి. 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 14 క్యారెట్లు అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవాలి. నగల బరువును డిజిటల్ యంత్రంలోనే చెక్ చేయించుకోవాలి.