Home Page SliderTelangana

“నిల్వలు ఉన్న సింగరేణి నీ ధ్వంసం చేసిన పాపం మీది కాదా” ? కేసీఆర్ పై ఈటల ఫైర్

కేసీఆర్‌కు ప్రైవేట్ వ్యక్తుల మీద ఉన్న శ్రద్ధ సింగరేణి మీద లేదని, నిల్వలు ఉన్న సింగరేణిని ధ్వంసం చేశారని మండిపడ్డారు ఈటల రాజేందర్. ఈ రోజు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈటల రాజేందర్. దీనిలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, ఆర్టీసీ మాజీ చైర్మన్ అశ్వద్ధామ రెడ్డి, అధికార ప్రతినిధి శుబాష్ తదితరులు పాల్గొన్నారు.

లక్షకు పైగా ఉద్యోగులతో కళకళలాడే సింగరేణిని, 40 వేల మందికి తగ్గించింది మీరు కాదా అన్నారు. ఉత్పత్తి పెరిగినా, ఉద్యోగులను తగ్గించి 99శాతం పనులు కాంట్రాక్టర్లకి ఇస్తున్నది మీ ప్రభుత్వమేనన్నారు. తెలంగాణ వచ్చిన తరువాత అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయ్యాయి. రాష్ట్రం వచ్చినప్పుడు 3500 కోట్ల బ్యాంక్ నిల్వలతో ఉన్న సింగరేణి ఇప్పుడు  10 వేల కోట్ల అప్పులో కూరుకుపోయింది.

216 మైన్స్ ను రద్దు చేయాలని సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా మోదీ సర్కార్ 2015 లో MMRD ఆక్ట్ ని సవరణ చేసింది. దీనికి కేసీఆర్  కూడా మద్దతు ఇచ్చారని గుర్తు చేశారు.  కోల్ ఇండియా దేశవ్యాప్తంగా 116 మైన్స్ అల్లోకేట్ చేసుకుంది. తెలంగాణలో కూడా నయిని, న్యూ పాత్రపద, పెనగడప మైన్స్ సింగరేణికి కేంద్రం అలాట్ చేసింది. 2019 తరువాత ఓపెన్ ఆక్షన్ లో సింగరేణి ఎందుకు పాల్గొనలేదు. అరబిందో శరత్ చంద్ర రెడ్డి గారు కోయాలగుడెం 119 MT మైన్ ను ఎలా దక్కించుకున్నారు జగమెరిగిన సత్యమన్నారు.  

కోల్ మైన్స్ లో పనిచేస్తున్న కాంట్రాక్ట్  కార్మికులకు కోల్ ఇండియా లో రోజుకు 930 రూపాయలు ఇస్తే, కెసిఆర్ గారి హయాంలో సింగరేణి 430 రూపాయలు మాత్రమే ఇస్తూ శ్రమ దోపిడీ చేస్తున్నారు. కార్మికుల కడుపు కొడుతుంది కెసిఆరేనన్నారు.  ప్రధాని పర్యటన సందర్భంగా BRS నిరసనలకు పిలుపు ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. సింగరేణి మీద ఏ వేదిక మీద అయిన చర్చకు సిద్దం. నిజాయితీ ఉంటే రావాలని సవాలు విసిరారు.  కెసిఆర్ కి ప్రజలు సరైన సమయంలో కర్రుకాల్చి వాత పెడతారు అని ఎద్దేవా చేశారు.  11 వేల కోట్ల అభివృద్ధి పనులు చేయడానికి ప్రధాని వస్తూంటే.. ఆ సమావేశంలో పాల్గొనకుండా, ప్రధానిని రాష్ట్రానికి  అహ్వనించకుండా సింగరేణి మీద అబద్ధపు ప్రచారం ఎత్తుకున్నారని విమర్శించారు.