కేటీ పెర్రీతో కెనడా మాజీ ప్రధాని ట్రూడో ప్రేమలో?
అమెరికన్ పాప్ సింగర్ కేటీ పెర్రీతో కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో డేటింగ్ చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.
ఇద్దరూ అమెరికా రాష్ట్రం కాలిఫోర్నియాలో ఓ బోటులో విహరిస్తుండగా, ట్రూడో పెర్రీకి కిస్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.గత జూలైలో డిన్నర్ డేట్ సందర్భంగా వీరు తొలిసారి కలిసి కనిపించారు. అప్పటి నుంచే వీరి మధ్య స్నేహం ప్రేమగా మారిందనే చర్చ నడుస్తోంది.
గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే — ట్రూడో 2023లో భార్య సోఫీతో విడిపోయారు, మరోవైపు కేటీ పెర్రీ 2025 జూన్‌లో నటుడు ఒర్లాండో బ్లూమ్‌తో నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు.
ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారి, నెటిజన్ల మధ్య హాట్ టాపిక్‌గా నిలుస్తున్నాయి.

