ఎమ్మెల్యే రాజాసింగ్ పై వేటుకు బీజేపీ సిద్ధమా…
హైదరాబాద్ : పార్టీ ప్రముఖులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు పరిపాటిగా మారిందని బీజేపీ భావిస్తోంది. దీనిపై రాష్ట్ర నాయకత్వం నుంచి హస్తిన హైకమాండ్ దాకా రాజాసింగ్ పట్ల సీరియస్ గా ఉందని తెలుస్తోంది.రాష్ట్ర అధ్యక్ష్య పదవికి పోటీచేసేందుకు నామినేషన్ పత్రం ఇచ్చినా, అతను నామినేషన్ దాఖలు చేయకుండా పార్టీపై తీవ్ర విమర్శలు చేయడంతో హైకమాండ్ గుర్రుగా ఉంది.గతంలో ఎన్నికల ముందు ఓ సారి సస్పెండ్ చేసి ఎత్తివేసింది. మళ్లీ అదే తీరుతో పార్టీ వ్యవహారాల్లో అత్యుత్సాహం చూపిస్తున్నారని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.

