KTR ఫామ్‌హౌస్‌కు ఇరిగేషన్ అధికారులు
రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి మండలం జువ్వాడలోని KTR ఫామ్‌హౌస్‌కు ఇరిగేషన్ అధికారులు చేరుకున్నారు. ఈ ఫామ్‌హౌస్‌కు కొలతలు వేస్తూ హల్‌చల్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో చెరువుల ఆక్రమణ కట్టడాల విషయంలో హైడ్రా ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఈ ఫామ్‌హౌస్‌పై కూడా చెరువు FTL లో నిర్మించడం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి. అయితే దీనిని లీజుకు తీసుకున్నానని, తనది కాదని కేటీఅర్ ముందే పేర్కొన్నారు. కేటీఆర్, తన సోదరి కవితకు బెయిల్ సందర్బంగా ఢిల్లీకి వెళ్లిన సమయంలో అధికారులు ఈ ఫామ్‌హౌస్‌కు రావడం, కేటీఆర్ లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.

