బాలికలపై ఇరాక్ ఉక్కుపాదం
బాలికల హక్కులపై పూర్తిగా ఉక్కుపాదం మోపడానికి సిద్ధమయ్యింది ఇరాక్ ప్రభుత్వం. ఆచారాల పేరుతో బాలికలకు 9 ఏళ్లకే వివాహం చేసే కొత్త చట్టాన్ని అంగీకరించింది. గతంలో 18 సంవత్సరాలుగా ఉన్న వివాహ వయసును తగ్గించింది. అక్కడ షియత్‌లు ఎక్కువగా ఉండే జాఫరీ ఇస్లామిక్ లా ప్రకారం 9 ఏళ్లకే బాలికలకు పెళ్లి చేయవచ్చన్న నిబంధనకు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. దీనితో బాలికలు, మహిళల హక్కులు మరింత ప్రమాదంలో పడతాయని ప్రతిపక్షాలు, మానవహక్కులు, స్త్రీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

