“ఏపీలో రేషన్ బియ్యం అక్రమ తరలింపులో IPSల పాత్ర ఉంది”:మంత్రి నాదెండ్ల
ఏపీలో రేషన్ బియ్యం అక్రమ తరలింపులో 5గురు IPS అధికారుల పాత్ర ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. కాగా దీనిపై వెంటనే విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. కాగా మంత్రి ఇవాళ విజయవాడలో తక్కువ ధరకే కందిపప్పు,బియ్యం అందించే రైతు బజార్ తొలి కౌంటర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడలో అక్రమంగా తరలిస్తోన్న 43,249 మెట్రిక్ టన్నుల బియ్యం సీజ్ చేశామన్నారు. కాగా రాష్ట్రంలో పేదలకు అందాల్సిన బియ్యాన్ని పక్కదోవ పట్టిస్తున్నవారిపై తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

