Breaking NewsHome Page SliderNationalSports

శ్రీ‌రామ న‌వ‌మితో ఐపిఎల్ వేదిక మార్పు

ఐపీఎల్ 2025 ​కు ఇంకా ఒక్కరోజే మిగిలి ఉంది. మార్చి 22న ఈ మెగా లీగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఫుల్ షెడ్యూల్ వచ్చేసింది. ఆన్ని ఫ్రాంచైజీలు టైటిల్ నెగ్గడమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 06న కోల్‌కతా నైట్‌రైడర్స్‌ – లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్​లో మార్పులు జరిగాయి. తొలుత ఈ మ్యాచ్​కు కోల్​కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా ప్రకటించారు. కానీ, తాజాగా భద్రతా కారణాల వల్ల వేదికను మార్చినట్లు బెంగాల్‌ క్రికెట్‌ సంఘం అధ్యక్షుడు వెల్లడించారు.ఏప్రిల్ 06 ఆదివారం రోజున శ్రీ రామ నవమి కావ‌డంతో ఈ మార్పు చేశారు. పండగ సందర్భంగా ఆరోజు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఊరేగింపులు జరిగే అవకాశం ఉందని మార్చామ‌ని చెప్పారు. అయితే మ్యాచ్‌కు భద్రత కోసం పలు దఫాలుగా కోల్​కతా పోలీసులతో చర్చించామ‌ని,కానీ వారు భద్రత కల్పించడం కష్టమని చెప్పారన్నారు. ఒకవేళ పోలీసుల సెక్యూరిటీ లేకపోతే ఏప్రిల్ 6న మ్యాచ్‌ కోసం వచ్చే 65 వేల మందికి పైగా వచ్చే ప్రేక్షకులను కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుందన్నారు. అందుకే మ్యాచ్​ను రీ షెడ్యూల్ చేయమని బీసీసీఐను అడగగా, అదే రోజు మ్యాచ్​ వేదికను గువాహటికి మార్చిందని వెల్ల‌డించారు.