Home Page SliderTelangana

బ్లాక్ లో ఐపీఎల్ టిక్కెట్లు.. ఓ వ్యక్తి అరెస్ట్..

ఐపీఎల్ 18వ సీజన్ ఇవాల్టి నుంచి షురూ కానుంది. రేపు ఉప్పల్ స్టేడి యంలో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థా న్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో తిలకించేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఐపీఎల్ మ్యాచ్ టికెట్లు బ్లాక్ లో అమ్మడం కలకలం రేపింది. ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద మ్యాచ్ కు సంబంధించిన టికెట్లను అమ్ముతున్న భరద్వాజ్ అనే వ్యక్తిని ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడి వద్ద ఉన్న నాలుగు ఐపీఎల్ మ్యాచ్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో మ్యాచ్ టికెట్లను ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.