IPL షెడ్యూల్ వచ్చేసింది
2025లో జరగబోయే ఐపీఎల్ షెడ్యూల్ వచ్చేసింది. అంతేకాదు తదుపరి రెండేళ్లకు (2026, 2027) కూడా అప్‌డేట్ ఇచ్చేశారు. 2025 ఐపీఎల్ మ్యాచ్‌లు మార్చి 14న ప్రారంభం అవుతాయి. ఈ మ్యాచ్‌లు మే వరకూ కొనసాగుతాయి. మే 25న ఫైనల్స్ జరగనుందని నిర్వాహకులు ప్రకటించారు. ఈ నెల 24,25 తేదీలలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఇక 2026లో మార్చి 15 నుండి మే 31 వరకూ, 2027లో మార్చి 14 నుండి మే 30 మధ్య ఐపీఎల్ మ్యాచ్‌లు కొనసాగుతాయని సమాచారం.