IPL బెట్టింగ్ మాఫియా అరెస్ట్
ఈరోజు హైదరాబాద్‌లో నలుగురు క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. పక్కా సమాచారంతో బడా బెట్టింగ్ ముఠాపై రైడ్ చేశారు. రాజేంద్రనగర్ వద్ద మైలార్ దేవపల్లిలో బెట్టింగులు జరుగుతున్నాయి. ఇక్కడ 11 మంది సభ్యుల ముఠా ఉందని, అందులో ఏడుగురు పరారీలో ఉన్నారని సమాచారం. ఈ ప్రదేశంలో 50 లక్షల రూపాయల నోట్లకట్టలు స్వాధీనం చేసుకున్నారు. IPL సీజన్ వచ్చిందంటే చాలు. బెట్టింగ్ బుకీలు జోరుగా బెట్టింగులు నిర్వహిస్తుంటారు. లక్షల, కోట్ల రూపాయలు చేతులు మారుతూ ఉంటాయి. ఈరోజు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ముంబై, హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ కోసం భారీగా బెట్టింగులు జరిగాయి. ఈ మ్యాచ్ కోసం భారీగా బుకీలు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక్కడ డబ్బుతో పాటు పదుల సంఖ్యలో ఫోన్లు కూడా దొరికాయి.