home page sliderHome Page SliderNational

ఐపీఎల్ 2025 వాయిదా..

భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ – 2025ను బీసీసీఐ నిరవధికంగా వాయిదా వేసింది. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇవాళ కీలక సమావేశం నిర్వహించిన బీసీసీఐ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. యుద్ధ పరిస్థితుల్లో లీగ్ నిర్వహించలేమని దేశ రక్షణ, ఆటగాళ్ల భద్రతే తమ ప్రాధాన్యం అని బోర్డు ఉన్నతాధికారి వివరించినట్లు జాతీయ మీడియా పేర్కొన్నది. తదుపరి షెడ్యూల్ ను త్వరలోనే వెల్లడించనున్నారు. నిన్న ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన మ్యాచ్ మధ్యలోనే రద్దయిన సంగతి తెలిసిందే. ఇవాళ లక్నో వేదికగా లక్నో వర్సెస్ బెంగళూరు మధ్య మాచ్ జరగాల్సి ఉండగా ఇంతలో టోర్నీ వాయిదా పడింది. అయితే లీగ్ దశలో భాగంగా ఇంకా 12 మ్యాచ్ లు మిగిలి ఉన్నాయి. హైదరాబాద్, లక్నో, అహ్మదాబాద్, ఢిల్లీ, చెన్నె, బెంగళూరు, జైపూర్, ముంబై నగరాలు ఈ మ్యాచ్ లకు ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. ప్లే ఆఫ్స్ లో భాగంగా క్వాలిఫయర్, ఎలి మినేటర్-1 మ్యాచ్ లకు హైదరాబాద్, ఎలిమి నేటర్-2, ఫైనల్ మ్యాచ్ లకు కోలకతాలో నిర్వహించాల్సి ఉంది.