Andhra PradeshHome Page Slider

సీఎం జగన్ కు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల ఆహ్వానం

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం జగన్ ను దేవాదయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏ.వి.ధర్మారెడ్డి ఆహ్వానించారు. క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిసి టీటీడీ సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఆహ్వనించారు. ముఖ్యమంత్రికి ఆహ్వనపత్రికతో పాటు శ్రీ వేంకటేశ్వరస్వామి వారి శేషవస్త్రం, తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వేద పండితులు సీఎం జగన్ కు వేద ఆశీర్వచనం అందించారు. కాగా ఈ నెల 18 నుంచి 26 వరకు 9 రోజుల పాటు తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు నిర్వహించేలా టీటీడీ ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది.