మదనపల్లి ఫైల్స్ దగ్దం కేసుపై కొనసాగుతున్న విచారణ
ఏపీలోని మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీస్‌లో ఫైల్స్ దగ్దం అవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. అయితే దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. కాగా ఈ విచారణ ప్రస్తుతం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.విచారణలో భాగంగా ఈ కేసులో అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత పెద్దిరెడ్డి కుటుంబానికి దగ్గరగా ఉన్నవాళ్లు,పీఏలుగా పనిచేసిన వారి ఇళ్లపై సోదాలు జరుగుతున్నాయి.మరోవైపు భూబాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు.

