Home Page SliderTelangana

బొగ్గు గనుల ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్న INTUC

కోల్‌బెల్ట్‌: బొగ్గు గనుల ప్రైవేటీకరణను అడ్డుకుంటామని INTUC కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు పసునూటి రాజేందర్ తెలిపారు. మంగళవారం ఒకటో గనిలో INTUC ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన రాజేందర్ కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, సింగరేణిలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గతంలో గుర్తింపు సంఘం కార్మికుల సమస్యలను పట్టించుకోలేదన్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా మారుస్తామన్నారు. కార్మికులందరికీ సొంత ఇంటి పథకం కింద 250 గజాల స్థలం, రూ.20 లక్షల వడ్డీ లేని రుణం ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. గడియారం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.