ఉర్దూను రెండో అధికారిక భాషగా చేసిన ఏకైక పార్టీ టీడీపీ
వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా టీడీపీ సానుభూతిపరుల పింఛన్లు తొలగిస్తే, అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని చంద్రబాబు భరోసానిచ్చారు. గుంటూరు జిల్లాలోని పొన్నూరు మైనారిటీ సోదరులతో ఆత్మీయ సమావేశంలో టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. మైనార్టీలకు గతంలో టీడీపీ హయంలో అందించిన రంజాన్ తోఫా సహా అనేక పథకాలు ఈ సీఎం నిలివేశారని దుయ్యబట్టారు. ఉర్దూను రెండో అధికారిక భాషగా చేసిన ఏకైక పార్టీ టీడీపీ పార్టీ అన్నారు. 1985లోనే ముస్లింలకు మైనారిటీ కార్పోరేషన్ పెట్టామని గుర్తు చేశారు. ముస్లిం సోదరులు హజ్ యాత్రకు వెళ్లడం కోసం.. హైదరాబాద్‌లోనే హజ్ హౌస్ కట్టామన్నారు. నేరుగా హైదరాబాద్ నుంచి యాత్రకు వెళ్లే అవకాశం కల్పించామని, ముస్లింల మనో భావాలు గౌరవించామన్నారు. హజ్ యాత్రకు ఆర్థిక సాయం కూడా చేశామని చంద్రబాబు పేర్కొన్నారు.

10 లక్షల మందికి రంజాన్ తోఫా ఇచ్చిన టీడీపీ పార్టీ అని స్పష్టం చేశారు. 2014 తరువాత దుకాన్, మకాన్ దుల్హాన్ పథకం తీసుకువచ్చామని, వాటన్నింటిని ఈ సీఎం వచ్చిన తరువాత రద్దు చేశారన్నారు. టీడీపీ వచ్చిన తర్వాత మళ్లీ దుల్హన్ పథకం తీసుకు వస్తారని హామీ ఇచ్చారు. జగన్ రెడ్డిలా మోసం చేయ్యను దుల్హాన్ పథకం కింద లక్ష చెల్లిస్తామని వాగ్దానం చేశారు. ఐటీతో జీవితాలు మారుతాయని ఐటీ కంపెనీలను ప్రోత్సహించమన్నారు. ముస్లింలకు 3 లక్షల ఆర్థిక సాయం ఇచ్చి అందులో లక్ష సబ్సిడీ ఇచ్చి ముస్లిం వ్యాపారులకు అండగా నిలిచామన్నారు చంద్రబాబు.

