Home Page SliderNational

బిష్ణోయ్‌తో ఇంటర్యూ..7 మంది పోలీసుల సస్పెన్షన్

కాకలు తీరిన గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌ను జైల్లో ఇంటర్యూ చేసేందుకు అనుమతి ఇచ్చి, ఇరుకున పడ్డారు 7 మంది పోలీసులు. ఈ ఇంటర్యూ వ్యవహారంపై పంజాబ్ ప్రభుత్వం మండిపడింది. ఈ ఘటనలో ఇద్దరు డీఎస్పీలు సహా ఏడుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. 2023లో అతడు కస్టడీలో ఉన్న సమయంలో టీవీ ఇంటర్యూకు అనుమతిచ్చారు. ఆ సమయంలో రెండు ఇంటర్యూలు ప్రసారం అయ్యాయి. బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌ను చంపేస్తామంటూ బెదిరించడం, అతని సన్నిహితుడు బాబా సిద్దిఖీ హత్య విషయంలో లారెన్స్ బిష్ణోయ్‌ గ్యాంగ్ పేరు మారుమ్రోగుతోంది.