మార్చి 15 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు
ఏపీలో ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్మీడియట్ బోర్డు సోమవారం విడుదల చేసింది. మార్చి 2023, 15వ తేదీ నుండి ప్రారంభమయ్యే పరీక్షలు ఏప్రిల్ నాలుగో తేదీ వరకు కొనసాగుతాయి. మార్చి 15న మొదటి సంవత్సరం విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ తో పరీక్షలు ప్రారంభమవుతాయి. మరుసటి రోజున రెండో సంవత్సరం విద్యార్థులకు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ తో పరీక్షలు ప్రారంభమవుతాయి. పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్షలను 2023 ఏప్రిల్ 15,, 25,30, మే 10వ తేదీలలో నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది.
