Andhra PradeshBreaking NewsNewsTrending Today

ఏపీలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు రద్దు…..!

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ఉండవని ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు జనవరి 8 బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షలు ఇకపై నిర్వహించబోమని, ఇంటర్ రెండవ సంవత్సరం పబ్లిక్ పరీక్షలు మాత్రమే కొనసాగుతాయని పేర్కొన్నారు. విద్యార్థులు మంచి విద్యాభ్యాసం పొందేందుకు, ప్రపంచ స్థాయి పోటీకి తగినట్లు తయారయ్యేలా ఇంటర్ విద్యలో పలు సంస్కరణలు తీసుకువచ్చే విధంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. NCERT సిలబస్ ఆధారంగా, మాథ్స్, కెమిస్ట్రీ వంటి సబ్జెక్టుల్లో సిలబస్ చాలా తగ్గిపోయినట్లు వెల్లడించారు. ఇకపై ప్రతి సబ్జెక్టుకు 20 ఇంటర్నల్ మార్కులు ఉండేలా మార్పులు చేయబోతున్నారు. ఈ మార్పుల ద్వారా పరీక్షల ఒత్తిడిని తగ్గించి, ప్రాజెక్టులు, హోమ్ అసైన్‌మెంట్స్ ద్వారా విద్యార్థుల శక్తిని పరిగణనలోకి తీసుకుంటారు. ప్రజాభిప్రాయం పొందేందుకు వెబ్‌సైట్ లో జనవరి 26 వరకు ఓపెన్ ఉంది. విద్యార్థులు, టీచర్లు, విద్యా వ్యవస్థ ప్రతినిధుల నుంచి అభిప్రాయాలు తీసుకోవడం వల్ల మార్పులు సాఫీగా జరిగే అవకాశం ఉంటుంది.