హైకోర్టు మధ్యంతర తీర్పు, సుప్రీం కోర్టుకు సునీత
కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని, వైఎస్ వివేక కుమార్తె సునీత సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈనెల 25 వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయొద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించింది. ఐతే గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిందని సునీత పిటిషన్‌లో పేర్కొన్నారు. జస్టిస్ ఎం.ఆర్.షా ధర్మాసనం ముందు కేసు విషయాన్ని ప్రస్తావించారు. పిటిషన్ పై రేపు విచారణ చేపడతామని ధర్మాసనం పేర్కొంది.

