ఆసక్తికరంగా యశోద టీజర్..అదరగొట్టిన సామ్
టాలీవుడ్ అగ్ర కథానాయకి సమంత ప్రస్తుతం కెరీర్‌లో చాలా బిజీగా ఉన్నారు. ఇటీవల కాలంలో ఆమె ఎక్కువగా లేడి ఓరియంటెడ్ సినిమాలకే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో సమంత ఓ లేడి ఓరియంటెడ్ మూవీలో నటించారు. సమంత ప్రధానపాత్రలో నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ యశోద చిత్రం . డైరెక్టర్లు హరి-హరిష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా ఈ మూవీ టీజర్ చిత్ర బృందం ఈ రోజు విడుదల చేసింది. టీజర్ చూస్తే ఈ మూవీలో సమంత ఒక గర్భిణి స్త్రీగా నటించినట్లు తెలుస్తోంది. ముందుగా కంగ్రాట్స్ మీరు ప్రెగ్నెంట్ అంటూ ఈ మూవీ టీజర్ ప్రారంభమౌతుంది.

మొదటి మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి. టైమ్‌కి తినాలి,ఎక్కువసేపు నిద్రపోవాలి,జాగ్రత్తగా నడవాలి,బరువులు ఎత్తకూడదు. ఏ పని చేసిన దెబ్బతగలకుండా చూసుకోవాలి అని చెప్తున్న వైద్యురాలి సూచనలతో ఈ టీజర్ సాగింది. అయితే వైద్యురాలి సూచనలకు భిన్నంగా యశోద జీవితం సాగుతూ..అనేక ప్రమాదాలు ఎదుర్కొన్నట్లు ఈటీజర్‌లో చూపించారు.
ఈ నేపథ్యంలో యశోద అన్ని ప్రమాదాలను ధైర్యంగా ఎదుర్కొంటూ ఎలా ముందుకు సాగిందనేది ఈ వీడియో చూస్తే తెలుస్తోంది. మరి దీంట్లో యశోదకు ఎదురైన ప్రమాదం ఏంటి? ఆమె భర్త,కుటుంబ సభ్యులు ఎవరు? అనే ఎన్నో ఉత్కంఠ భరిత సన్నివేశాలతో ఈ సినిమా సిద్దమవుతోంది. ఇక ఈ సినిమాలో సామ్ నటన అందరిని ఆకట్టుకునేలా ఉంది. యాక్షన్ సన్నివేశాలలో ఆమె నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. అయితే ఈ రోజు సినిమా టీజర్‌ను షేర్ చేసిన సామ్ దీనికి ధైర్యం-సంకల్పం అనే క్యాప్షన్‌ను ఇచ్చారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళి శర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు.