Home Page SliderTelangana

స్మిత సబర్వాల్ ఇంట్రెస్టింగ్ ట్వీట్..

మిస్ వరల్డ్ – 2025 పోటీల వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. మే 7 నుంచి 31 వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ స్వాగత ఏర్పాట్లపై నిన్న చార్మినార్ సమీప ప్రాంతంలోని చౌమొహల్లా ప్యాలెస్ లో రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘కొన్ని రోజులు నా ఉద్యోగం నాకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను! మిస్ వరల్డ్-2025 ఈవెంట్ కోసం మా టీం ను వెల్కమ్ డిన్నర్ ఏర్పాట్లకు సిద్ధం చేస్తున్నాను. గొప్ప ప్రారంభోత్సవానికి కేవలం 30 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో అందరూ పనిలో మునిగి ఉన్నారు’ అని ట్వీట్ చేశారు. అయితే.. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేవారు మే 6, 7న హైదరాబాద్ కు రానున్నారు. అయితే.. తెలంగాణ టూరిజం బ్రాండ్ ఇమేజ్ పెరిగేలా చార్మినార్ కట్టడం వద్ద హెరిజేజ్ వాక్, చౌమొహల్లా ప్యాలెస్ లో వెల్కమ్ డిన్నర్ ఏర్పాట్లు చేస్తున్నారు.