ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
రైలు కిందపడి ఇంటర్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం పెద్ద కోడూరు గ్రామానికి చెందిన భార్గవి(17) ఓయూ ఆంధ్ర మహిళా సభ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. అయితే ఇవాళ ఉదయం హైదరాబాద్ లోని జామై ఉస్మానియా రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. డెడ్ బాడీని ఉస్మానియా మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకున్న కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

