Home Page SliderTelangana

నాగర్ కర్నూల్ జిల్లా చారకొండలో తీవ్ర ఉద్రిక్తత..

నాగర్ కర్నూల్ జిల్లాలో హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. జడ్చర్ల-కోదాడ 167 వ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా బైపాస్ రోడ్డు కోసం చారకొండలో 29 ఇండ్లను కూలగొట్టడానికి అధికారులు సిద్ధం అయ్యారు. పోలీసు బలగాలతో జేసిబిలతో అధికారులు వచ్చారు. బైపాస్ కోసం మా ఇండ్లు కూలగొట్టొద్దు అని బాధిత కుటుంబాలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు రంగంలో దిగి నిరసన తెలుపుతున్న వారిని తరిమి కొట్టారు. దీంతో చారకొండలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసన చేస్తున్న చిన్న పాపను సైతం పోలీసు వాహనాల్లో పోలీసులు తరలించారు.