అంబేద్కర్ విగ్రహానికి అవమానం..
భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అవమానం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం దూబచర్ల గాంధీ కాలనీలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి గుర్తు తెలియని వ్యక్తులు చెప్పుల దండ వేశారు. ఈ విషయం తెలుసుకున్న దళిత సంఘాల నేతలు, గ్రామస్తులు ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. నిందితుల కోసం డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దింపిన పోలీసులు.. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.