Breaking NewsHome Page SliderInternationalNewsPolitics

H-1B వీసాలో సంస్థాగత మార్పులు..డౌన్‌లోడ్ చేసుకోకపోతే నష్టపోయినట్లే..

అగ్రరాజ్యం అమెరికా అందించే హెచ్‌-1బి వీసాలపై సంస్థాగత మార్పులకు ఆదేశాలిచ్చింది ట్రంప్ సర్కారు. తాజా ఆదేశాల ప్రకారం మార్చి 20 నుండి ఐదేళ్ల కంటే పాతవైన రికార్డులన్నింటినీ సిస్టమ్ నుండి తొలగిస్తున్నారు. ఉద్యోగులు కూడా వారికి సంబంధించిన పాత వీసాల రికార్డులను డౌన్‌లోడ్ చేసి పెట్టుకోవాలని లేకపోతే వాటిని కోల్పోతారని హెచ్చరించింది. హెచ్-1బీతో సహా తాత్కాలిక లేబర్, శాశ్వత లేబర్ సర్టిఫికేట్ అప్లికేషన్లను కూడా ఇలాగే తొలగిస్తారు. ఈ మేరకు ఆఫీస్ ఆఫ్ ఫారిన్ లేబర్ సర్టిఫికేషన్ విభాగం నోటీసులు జారీ చేసింది. యూఎస్ ఇమిగ్రేషన్ విభాగం త్వరలోనే కొత్త దరఖాస్తుల ప్రక్రియ ద్వారా వీసాల జారీ చేపట్టనుంది. అందుకే పాత దరకాస్తు విధానాన్ని రద్దు చేస్తూ, అప్లికేషన్లను రికార్డుల నుండి తొలగిస్తున్నారు. ఇకపై లబ్ధిదారు అనేక దరకాస్తులు చేసుకున్నా, ఒకే అప్లికేషన్‌గా పరిగణిస్తారు. రిజిస్ట్రేషన్ల సంఖ్యతో సంబంధం లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు. కొన్ని సంస్థలు లాటరీ సిస్టం ద్వారా ప్రయోజనం పొందండం కోసం బహుళ రిజిస్ట్రేషన్లు సమర్పిస్తున్నాయని, దీనిని అరికట్టేందుకే ఈ రూల్స్ పెట్టినట్లు పేర్కొన్నారు.