ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ.. నారీ నారీ నడుమ మురారి
ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ వ్యవహారం యువతుల ప్రాణాల మీదకి తెచ్చింది. ఓ విచిత్ర ప్రేమ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇన్‌స్టాగ్రామ్‌లో శారద, రేష్మాకు దివాకర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు.. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దివాకర్‌ను ఇద్దరు యువతులు ప్రేమించారు. అయితే.. దివాకర్ ప్రేమ విషయంలో ఇద్దరి యువతుల మధ్య ఘర్షణ జరిగింది. ఆర్డీఓ కార్యాలయం సమీపంలో శారద, రేష్మా పురుగు మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో శారద మృతి చెందింది. వివాహిత రేష్మా పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.