Home Page SliderTelangana

ఉద్యోగులకు టోకరా కొట్టిన ‘ఇన్సోఫీ’ కంపెనీ-ఉద్యోగుల ఆందోళన

హైదరాబాదులోని గచ్చిబౌలిలోని ‘ఇన్సోఫీ’ అనే సాఫ్ట్‌వేర్ సంస్థ ఉద్యోగులను నిలువునా ముంచేసింది. 700 మంది ఉద్యోగులు ఉన్న ఈ సంస్థ ఏడాదిన్నరగా ఉద్యోగులకు జీతాలు చెల్లించడం లేదు. పైగా 650 మంది  ఉద్యోగుల పేరుతో తలా 4 లక్షల చొప్పున, 50 మంది పేరుతో 10 లక్షల చొప్పున లోన్ తీసుకుంది. వారు తీసుకున్న లోన్‌నే వారికి స్టైఫండ్‌గా చెల్లించింది. కాలేజీ క్యాంపస్ సెలక్షన్స్‌లో భాగంగా కొందరు ఉద్యోగులను తీసుకుంది. వీరిని 9 నెలలు ట్రైనింగ్ ఉంటుందని, తర్వాత 5 నెలలు ఇంటెర్న్‌షిప్ అని వారిని సెలక్ట్ చేసుకుంది. 3 ఏళ్లు గ్యారంటీ ఉద్యోగం ఉంటుందని చెప్పి వారిని తీసుకువచ్చినట్లు సమాచారం. నిన్న(సోమవారం) కంపెనీ సీఈవో అకస్మాత్తుగా మీటింగ్ పెట్టి, ఉద్యోగులందరినీ తొలగిస్తున్నట్లు చెప్పారు. దీనితో వీరు ఆందోళనలకు దిగారు. ఈ కంపెనీ సీఈవో దక్షిణామూర్తిని తమ వద్దకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు వేతనాలను ఇవ్వాలని, జాబ్ సెక్యూరిటీని కల్పించాలని నినాదాలు చేస్తున్నారు.