ఐఎన్ఎస్ విక్రాంత్ అదరహో
నేడు ప్రధాని నరేంద్ర మోదీ భారత్ దేశీయంగా నిర్మించిన ఐఎన్ఎస్ విక్రాంత్‌ను నౌకదళంలోనికి ప్రవేశపెట్టారు. కేరళ పర్యాటనలో ఉన్న ప్రధాని మోదీ కొచ్చిన్ షిప్‌యార్డ్‌లో దీనిని జాతికి అంకితమిచ్చారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ..కేరళ తీరంలో ఈరోజు నవశకం ప్రారంభమైందని , అమృతోత్సవ వేళ ఐఎన్ఎస్ ప్రవేశం శుభారంభమని సంతోషం వ్యక్తం చేసారు. భారత్‌కు సాధ్యం కానిదంటూ ఏదీ లేదని.. ఐఎన్‌ఎస్‌ను చూసి ప్రతి భారత పౌరుడు గర్వపడాలని మోదీ అన్నారు. 2023 నాటికి విక్రాంత్ పూర్తి స్థాయిలో నౌకదళంలోకి చేరే అవకాశముందన్నారు.

ఇక ఐఎన్ఎస్ విక్రాంత్ ప్రత్యేకలకు వస్తే… ఇది గంటకు 28 నాట్స్ వేగంతో ప్రయాణిస్తుంది. దీనిని నిర్మించడానికి దాదాపు 13 ఏళ్లు పట్టింది. అంతేకాక దీని పూర్తి తయారీకి 20,000 కోట్లు ఖర్చయ్యింది. ఈ నౌక బరువు 262 మీటర్ల పొడవు , 62 మీటర్ల వెడల్పు కలిగి సుమారు 37,500 టన్నుల బరువు ఉంది. ఇందులో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. దీనిలో మొత్తం 14 అంతస్తులు ,2300 కంపార్ట్మెంట్స్ కలిగి అత్యంత సౌకర్యవంతంగా దీనిని రూపొందించారు.
దీని విధి నిర్వహణ పనులను చక్కదిద్దేందుకు 1600 మంది సిబ్బంది ఉన్నారంటే ఇది ఎంత పెద్ద నిర్మాణమో అర్ధం అవుతుంది. అదే విధంగా రెండు టేకాఫ్ రన్వేలు , ఒక ల్యాండింగ్ స్ట్రిప్‌తో, క్షిపణి దాడులను తట్టుకునే విధంగా దీన్ని నిర్మించారు. గత ఏడాది ఐఎన్ఎస్ పై జరిగిన ట్రయిల్స్ కూడా విజయవంతంగా ముగిశాయి.

ఇప్పటి వరకు భారత్ వద్ద ఉన్న యుద్ధ నౌకలన్నీ వేరే దేశాలనుండి దిగుమతి చేసుకోగా , ఐఎన్ఎస్ విక్రాంత్ మాత్రం అగ్రదేశాలన్నీ ఆశ్చర్యపడేలా పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ విజయవంతంగా నిర్మించింది. మల్టీ స్పషలిటి హాస్పటల్‌ను ఇందులో నిర్మించి , ఫిజియోథెరపీ క్లినిక్ , ఐసీయూ , ల్యాబొరేటరీ , సీటీ స్కానర్ , ఎక్స్‌రే మెషీన్లు , డెంటల్ కాంప్లెక్స్ , ఐసోలేషన్ వార్డులతో ఎంతో ఆధునాతన టెక్నాలజీతో దీనిని నిర్మించారు. అంతేకాకుండా 16 బెడ్లు , రెండు ఆపరేషన్ థియేటర్లు కూడా ఉన్నాయి. 5 మంది మెడికల్ ఆఫీసర్లు , 17 మంది మెడికల్ సెయిలర్స్ ఉన్నారు. దీని కిచెన్ సెట్టింగ్ అయుతే మరో అధ్భుతమనే చెప్పొచ్చు. కేవలం ఒకగంట వ్యవధిలో 1000 మందికి చపాతీలు , ఇడ్లీలు వండేటట్టు ఆధునాతన పరికరాలతో దీనిని సిద్ధ పరిచారు. భారతీయులు ఎందులోనూ తక్కువ కాదని .. భారత పౌరులంతా తలెత్తుకునేలా దీనిని నిర్మించారని మోదీ హర్షం వ్యక్తం చేశారు..