RCBని వెంటాడుతున్న గాయాలు
ఈ IPL సీజన్లో RCBకి వరుసగా షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. కాగా IPL 2023 ప్రారంభమైనప్పటి నుంచి RCB ప్లేయర్స్ గాయాల బారిన పడుతూనే ఉన్నారు. ఇప్పటికే హేజిల్‌వుడ్ ,రజత్ పాటిదార్,విల్ జాక్స్ గాయంతో టీమ్‌కు దూరమయయిన విషయం తెలిసిందే. తాజాగా ఈ టీమ్ ప్లేయర్ పేసర్ రీస్ టాప్లీ సైతం గాయపడ్డాడు. ఇటీవల MI తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తూ.. రీస్ టాప్లీ కింద పడిపోయాడు. దీంతో అతని భుజం కదిలింది. అయితే డాక్టర్లు దానిని సరిచేసినప్పటికీ..స్కాన్ల నిమిత్తం ఆయన ఇంగ్లాండ్‌కు వెళ్లిపోయాడు. దీంతో మరో ప్లేయర్ జట్టుకు దూరమయ్యాడు.