Home Page Sliderhome page slider

పెట్రోల్ బంక్‌లో అమానుషం..

ఏపీలోని కదిరి-రాయచోటి రోడ్డుపై వైసీపీ నేత హరికి చెందిన పెట్రోల్ బంక్‌లో 24 వేల రూపాయలు తక్కువ వచ్చాయని పంప్ బాయ్ బాబా ఫక్రుద్దీన్‌ను యజమాని చితకబాదాడు. బట్టలు విప్పి, ఇనుప స్తంభానికి కట్టి పలు రకాలుగా హింసించి దాడి చేశాడు. బాధితుడి బంధువుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని బాధితుడిని విడిపించారు. మేనేజర్ సత్యనారాయణతోపాటు ఇద్దరిని అదుపులోకి తీసుకొని కదిరి రూరల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.