రెచ్చిపోయిన మావోయిస్టులు..ఇద్దరికి బహిరంగంగా ఉరి
అందరూ చూస్తుండగా బహిరంగంగా ఉరితీసిన దారుణ ఘటన ఛత్తీస్‌ఘడ్‌లోని బీజాపూర్ జిల్లాలో జరిగింది. వీరిని పోలీస్ ఇన్ఫార్మర్లుగా భావించి ఇద్దరు గ్రామస్తులను ఉరి తీశారు. అక్కడ జప్పెమర్క అనే గ్రామానికి చెందిన ఒక విద్యార్థితో పాటు ఇద్దరు గ్రామస్తులను అపహరించారు. ప్రజాకోర్టు నిర్వహించి మడ్వి, పోడియం అనే వ్యక్తులను చెట్టుకు ఉరివేసి హత్య చేశారు. వారి చొక్కాలకు కరపత్రాన్ని అతికించి, ఈ హత్యలకు తమదే బాధ్యత అని భైరంగఢ్ ఏరియా మావోయిస్టు కమిటీ ప్రకటించింది. వారు మృతదేహాలకు అతికించిన కరపత్రాలలో చాలా ఏళ్లుగా పోలీసులకు గూఢచర్యం చేస్తున్నారని, అందుకే మరణశిక్ష విధిస్తునట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఎవ్వరికీ ఫిర్యాదులు చేయకూడదని, గ్రామస్తులను హెచ్చరించి, బెదిరించినట్లు సమాచారం. వారు విడుదల చేసిన కరపత్రాలలో బీజేపీని బహిష్కరించాలని పిలుపునివ్వడం గమనార్హం. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.