National

స్టాక్ మార్కెట్లో ఇన్ఫోసిస్ హవా

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసాయి. ప్రారంభంలో వెయ్యి పాయింట్లకు పైగా ఎగిసిన మార్కెట్లో చివరిలో లాభాల స్వీకరణ కనిపించింది. చివరికి వారంలో సెన్సెక్స్ 685 పాయింట్లకు పెరిగి 57919 వద్ద , నిఫ్టీ 171 పాయింట్ల లాభంతో 17186 వద్ద ముగిసింది. ఈ క్రమంలో అన్ని రంగాల్లోనూ షేర్లు పెరుగగా.. ఇన్ఫోసిస్ టాప్ గెయినర్‌గా నిలిచింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు , యూపీఎల్ , హెచ్‌సీఎల్ తదితరాలు లాభాల దిశలో ఉండగా , ఓఎన్జీజీసీ , ఎంఅండ్ఎం , జేఎస్‌డబ్యూ స్టీల్ , హిందాల్కో , బజాజ్ ఆటోలు నష్టాల బాట పడ్డాయి. ఇక డాలరు మారకం రూపాయి 82.35 వద్ద ముగిసింది.