Home Page SliderPoliticsTelanganatelangana,

‘ధరణి ద్వారా మన రైతుల సమాచారం విదేశాలకు’..సీఎం

బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్ ఆర్థిక నేరాలకు అలవాలంగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ పోర్టల్‌ను అందుకే రద్దు చేశామని పేర్కొన్నారు. ఫిలిప్పీన్స్, సింగపూర్, కెమెన్ హైలాండ్స్, వర్జీన్ హైలాండ్ వంటి దేశాలకు మన రైతుల సమాచారం వెళ్లిందన్నారు. పోర్టల్ నిర్వహణ కంపెనీల చేతులు మారిందని, కానీ సీఈవో మాత్రం గాదె శ్రీధర్ రాజే ఉన్నారు. ఇది తీవ్రమైన నేరం. మన రైతుల అత్యంత సున్నితమైన సమాచారం విదేశీయుల చేతిలో ఎందుకు పెట్టారు. వారికి తప్పకుండా శిక్ష పడాలంటూ అవేశంగా మాట్లాడారు.