ప్రపంచ వ్యాప్తంగా “ఇంద్ర” కలెక్షన్ల రికార్డ్…
మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఆర్తి అగర్వాల్, సోనాలి బింద్రేలు హీరోయిన్లుగా డైరెక్టర్ గోపాల్ తెరకెక్కించిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇంద్ర” గురించి అందరికీ తెలుసు. గత 22 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ చిత్రం అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు బద్దలుకొట్టింది. మళ్ళీ ఇప్పుడు మెగాస్టార్ బర్త్ డే కానుకగా రిలీజైన ఈ చిత్రం మరోసారి ఆల్ టైం రికార్డ్స్‌కి ఎక్కింది.
ఓవర్సీస్‌లో ఇంద్ర ఇప్పుడు ఆల్ టైం రికార్డులు పాత సినిమాలలో నమోదైన ఈ చిత్రం కొత్త చిత్రాలతో పోటీపడి మరీ మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. దాదాపు ఫస్ట్ డే రోజునే 3 కోట్ల రూపాయలను దాటిపోయింది. మొదటి రోజు యూఎస్‌తో సహా ఇతర దేశాల్లో కలిపి ఇంద్ర చిత్రం ఏకంగా 75 వేల డాలర్స్‌కి పైగా గ్రాస్‌ని అందుకుంది. దీంతో మన తెలుగు నుండి రిలీజైన అన్ని సినిమాలకంటే భారీ మార్జిన్‌తో ఇంద్ర ఈ ఆల్ టైం రికార్డు నెంబర్ సెట్ చేసినట్టుగా టాక్. మొత్తానికి అయితే ఇంద్ర లోని పవర్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించింది. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా వైజయంతి మూవీస్ వారు నిర్మించిన చిత్రం ఇది.

