Home Page SliderTelangana

రేషన్ కార్డులు లేనివారికి ఇందిరమ్మ ఇండ్లు

రేషన్ కార్డు లేకపోయినా వారికి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. త్వరలోనే రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మొదలవుతుందన్నారు. ఖమ్మం జిల్లా కూసు మంచిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిరుమలాయపాలెం మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో మంత్రి పొంగులేటి ఇవాళ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏ గ్రామ పంచాయతీ కార్యదర్శి ఆ గ్రామంలోనే నివాసం ఉండాలని, అప్పుడే స్థానిక స్థితిగతులు తెలుస్తాయని పేర్కొన్నారు. గ్రామ కార్యదర్శులపై ఎంపీడీవోల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని సూచించారు. పనుల్లో నిర్లక్ష్యం వహించే కార్యదర్శులపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.