ఇందిరమ్మ ఇళ్లు సంక్రాంతికే …పొంగులేటి
నల్గొండ జిల్లా నకిరేకల్‌లో కాంగ్రెస్ విజయోత్సవ సభలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఆయన ఈ సభలో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ కానుకగా ఇందిరమ్మ ఇళ్లపై ప్రకటన వెలువడుతుందని పేర్కొన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఏర్పాటు చేసిన ఈ విజయోత్సవ సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లపై తెలంగాణ ప్రజలకు హామీనిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలను మరిచిపోదని, ఆరు గ్యారెంటీలలో రెండిటిని ఇప్పటికే అమలు చేశామని పేర్కొన్నారు. కాంగ్రెస్ పథకాలు ప్రతీ గడపను పలుకరిస్తాయన్నారు. త్వరలోనే రాష్ట్రంలో డ్రగ్స్ మాఫియాను తరిమికొడతామన్నారు.

