దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇండ్లు
పేదలకు దీపావళి కానుకగా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అధిక వర్షాల కారణంగా పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తెచ్చిన పత్తిలో కోత విధిస్తే ఊరుకునేది లేదని అన్నారు. కాంగ్రెస్ రైతుల పక్ష ప్రభుత్వమని ఆయన పునరుద్ఘాటించారు. ఇప్పటికే రూ. 18 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామని, మిగతా వాటిని త్వరలోనే పూర్తి చేస్తామని పొంగులేటి పేర్కొన్నారు.

