Home Page SliderTelangana

పీసీసీ చీఫ్ కి ఇందిరా గాంధీ ఎక్స్ లెన్సీ అవార్డు

తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర శాఖ ప్రతి ఏటా ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా ఇచ్చే ఇందిరా గాంధీ ఎక్స్ లెన్సీ అవార్డు 2024 ఏడాదికిగాను పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కు దక్కింది. ఈ అవార్డును మహేశ్ కుమార్ గౌడ్ కు ఆయన ఇంట్లో ఫోరం ప్రతినిధులు అందజేశారు. జాతీయ సమైక్యత, మత సామరస్యం, శాంతి స్థాపనకై కృషి చేసి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరుతూ ఫోరం అధ్యక్షుడు రాజ నారాయణ ముదిరాజ్.. మహేశ్ గౌడ్ కు శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి సన్మానించారు.