Home Page SliderNational

ఇందిరాగాంధీ మమ్మల్ని హింసించలేదు..లల్లూ

ఆర్జేడీ చీఫ్ లలూప్రసాద్ యాదవ్ మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ పెట్టిన ఎమర్జెన్సీ గురించి కీలక విషయాలు వెల్లడించారు. తమను ఎమర్జెన్సీ సమయంలో ఇందిర జైలులో పెట్టించారని అయినా మమ్మల్ని హింసించలేదని పేర్కొన్నారు. తాను ఎమర్జెన్సీ సమయంలో 15 నెలలపాటు జైలులో ఉన్నానని వివరించారు. అప్పటి ప్రభుత్వం ఎమర్జెన్సీ విషయంలో ఎలా ప్రవర్తించిందో.. ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపక్షాలను గౌరవించకపోతే అది కూడా మాయని మచ్చగా మిగిలిపోతుందని హితవు చెప్పారు. ‘ది సంఘ్ సైలెన్స్ ఇన్ 1975’ అనే పేరుతో రాసిన ఆర్టికల్‌లో ఈ విషయం ప్రస్తావించారు లలూ ప్రసాద్.