బహుముఖ ప్రజ్క్షకు భారతావని బాష్పనివాళి
జాతి ప్రయోజనాల కోసం పాటు పడిన ప్రతీ ఒక్కరిని ఈ భారతావని కచ్చితంగా కడుపులో దాచుకుంటుందని మన్మోహన్ విషయంలోనే రుజువైంది. జాతి మత కుల ప్రాంత భేదాలు లేకుండా పార్టీలకతీతంగా భారత దేశంలో మెజార్టీ ప్రజల తరుఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రముఖులంతా మన్మోహన్‌కు అశృనివాళులు అర్పించారు.ఏదో చూశాం..వెళ్లాం అన్నట్లుగా కాకుండా తమ కుటుంబానికి వచ్చిన కష్టం మాదిరిగా రెండు రోజుల నుంచి జరుగుతున్న మన్మోహన్ అంతిమ సంస్కార వేడుకల్లో భాగస్వాములయ్యారు. దేశ ప్రధమ పౌరురాలు ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్ర పతి ధన్కర్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, బీజెపి పెద్దలు అమిత్ షా,రాజ్ నాథ్ సింగ్,గడ్కరీ,కాంగ్రెస్ పెద్దలు సోనియాగాంధీ, రాహుల్,ఖర్గే,సీఎంలు రేవంత్ ,సిద్దా రామయ్య, భూటాన్ రాజు జిగ్మే వాంగ్ చుక్, కేంద్ర మంత్రులు, దేశంలో అనేక మంది ప్రముఖులు నిగమ్ బోధ్ కు తరలివచ్చి మన్మోహన్ అంతిమ సంస్కారాలను వీక్షించారు.త్రివిధ దళాల గౌరవ వందనాల నడుమ పుష్పగుచ్చాలుంచి తుది వీడ్కోలు పలికారు.ఈ సందర్భంగా వారంతా మన్మోహన్ కుటుంబీకులకు దేశం అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

