Home Page SliderNational

“భారత్‌లో వెయ్యేళ్లకు సుస్థిర ఇంధనమార్గం”..చంద్రబాబు

నాన్ రెన్యువబుల్ ఎనర్జీలో కేంద్రప్రభుత్వం చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. రాబోయే వెయ్యేళ్లకు సుస్థిర ఇంధనమార్గం వేస్తున్నారని ఆయన తెలిపారు. నేడు గుజరాత్‌లోని రీ-ఇన్వెస్ట్ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. నేడు ఆయన గాంధీనగర్‌లోని రీ-ఇన్వెస్ట్ సదస్సులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. భవిష్యత్తు భద్రతకై సౌర, అణు, పవన, జలవిద్యుత్‌పై భారత్ దృష్టి సారించింది. భారత్‌లో గ్యాస్, చమురు నిల్వలు లేకపోవడంతో ఈ మార్గాలు బాగా ఉపయోగపడతాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో ఏపీ, గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌ఘడ్, గోవాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ప్రభుత్వ, ప్రైవేట్ పరిశ్రమలకు, ఆర్థిక రంగాలకు సంబంధించిన దాదాపు పదివేల మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు.